యువశక్తిని ఏకీకృతం చేయడానికి మేరా యువ భారత్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 29 October 2023

యువశక్తిని ఏకీకృతం చేయడానికి మేరా యువ భారత్ !


క్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా యువత కోసం దేశ వ్యాప్తంగా మేరా యువ భారత్ (మైభారత్) వేదికను ప్రారంభించనున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించేందుకు ఇది అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఆదివారం ప్రధాని మోడీ మన్‌కీ బాత్ 106వ ఎపిసోడ్‌లో మాట్లాడారు. గత నెలలో ఢిల్లీలో ఖాదీ దుస్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయని, ఈనెల పండగ సీజన్‌లో కూడా దేశ వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో ఖాదీ దుస్తులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారని ప్రధాని అన్నారు. రాబోయే పండగలకు కూడా ఇదే స్ఫూర్తితో స్థానికంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని దేశ ప్రజలను కోరారు. లోకల్ ఫర్ వోకల్ నినాదానికి ఇదెంతోబలాన్ని ఇస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువత my bharat.gov.inలో తమ పేర్లను తప్పక రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. "అక్టోబర్ 31న దేశంలో అతిపెద్ద సంస్థను ప్రారంభించబోతున్నాం. దాని పేరే మై యంగ్ ఇండియా (మైభారత్). దేశాభివృద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషించడానికి మై భారత్ అవకాశాలను కల్పిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించేందుకు దేశం లోని యువశక్తిని ఏకీకృతం చేయడానికి ఇదో వినూత్న ప్రయత్నం" అని ప్రధాని తెలిపారు. అమృత్ కలశ్ యాత్ర పేరుతో ప్రతిగ్రామం నుంచి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వివిధ గ్రామాల నుంచి ప్రారంభమైన అమృత్ కలశ్ యాత్ర త్వరలో ఢిల్లీకి చేరుకుంటుందన్నారు. అక్టోబర్ 31 మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించాలని దేశ ప్రజలను కోరారు. ఇకపై ప్రతి భారతీయుడు దేశంలోని పర్యాటక స్థలాలకు వెళ్లిన ప్రతిసారీ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment