నెదర్లాండ్స్‌ చేతిలో బం‍గ్లాదేశ్‌ ఓటమి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 29 October 2023

నెదర్లాండ్స్‌ చేతిలో బం‍గ్లాదేశ్‌ ఓటమి

వన్డే ప్రపంచకప్‌-2023లో కోల్‌కతా వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఓటమి పాలైంది. 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్‌ విఫలమైంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షకీబ్‌ సేన కేవలం 142 పరుగులకే కుప్పకూలింది. డచ్‌ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లతో బంగ్లా టైగర్స్‌ పతనాన్ని శాసించాడు. బంగ్లా బ్యాటర్లలో మెహాదీ హసన్‌ మీరాజ్‌ (35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా నెదర్లాండ్స్‌ వంటి పసికూన చేతిలో తమ జట్టు ఓటమి పాలవ్వడం బంగ్లా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంగ్లా జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో స్టేడియంకు వచ్చిన ఓ బంగ్లా అభిమాని ఆటగాళ్లు ప్రదర్శనను విమర్శిస్తూ షూతో తనను తాను కొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments:

Post a Comment