వరల్డ్‌కప్ చరిత్రలో చరిత్ర సృష్టించిన డికాక్‌ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 24 October 2023

వరల్డ్‌కప్ చరిత్రలో చరిత్ర సృష్టించిన డికాక్‌

వన్డే ప్రపంచకప్‌-2023లో ద‍క్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తన కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న డికాక్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌పై డికాక్‌ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. బంగ్లాదేశ్ బౌలర్లను డికాక్‌ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త ఆచతూచి ఆడిన క్వింటన్‌ మిడిల్ ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్‌  15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో డికాక్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఇది వన్డేల్లో అతడికి రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం గమానార్హం. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన డికాక్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గిల్‌క్రిస్ట్‌ 149 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గిల్‌క్రిస్ట్‌ రికార్డును డికాక్‌(174) బ్రేక్‌ చేశాడు. 

No comments:

Post a Comment