ఎయిర్‌పోర్టులో 'నా లగేజీలో బాంబు ఉందా' అన్నందుకు కేసు నమోదు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 25 October 2023

ఎయిర్‌పోర్టులో 'నా లగేజీలో బాంబు ఉందా' అన్నందుకు కేసు నమోదు !


కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన ఓ ప్రయాణికుడు దుబాయ్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. తాను బయలుదేరే రోజు రావడంత విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. సాధారణ ఫార్మాలిటీస్ అన్ని ముగించుకున్నాడు. అయితే.. లగేజీ వద్ద ఓ సమస్య వచ్చిపడింది. పరిమితికి మించి లగేజీ బరువుగా ఉండటంత సిబ్బంది దాన్ని అనుమతించలేదు. వాళ్లు పదే పదే చెక్ చేసినా లగేజీ బరువుగా ఉందని మీటర్ చూపించింది. ఈ క్రమంలోనే ఆ ప్రయాణికుడు ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన బ్యాగ్‌ని పదే పదే తనిఖీ చేస్తుండటంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. అప్పుడు అతడు 'నా లగేజీలో బాంబు ఉందా' అని వ్యంగ్యంగా అన్నాడు. అంతే ఆ ఒక్క మాట అతని పాలిట శాపమైంది. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ  ఎయిర్‌పోర్టు అధికారులు ఆ ప్రయాణికుడిపై సీరియస్ అయ్యారు. అంతేకాదు అతనిపై కేసు నమోదు చేశారు. తన పొరపాటున ఆ మాట అనేశానని, ఏదో సరదా కోసం అన్నానే తప్ప మరే దురుద్దేశంతో కాదని ఆ ప్రయాణికుడు ఎంత మొత్తుకున్నా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. కేరళ పోలీసు చట్టంలోని సంబంధిత సెక్షన్‌ కింద ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. 

No comments:

Post a Comment