ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్‌గా రాజ్‌కుమార్‌ రావు నియామకం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 25 October 2023

ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్‌గా రాజ్‌కుమార్‌ రావు నియామకం


బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావును నేషనల్‌ ఐకాన్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గురువారం ఉదయం 11.30గంటలకు రంగ్‌భవన్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య ఎన్నికల కమిషనర్‌ ఆయనను అధికారికంగా నియమించనున్నారు. రాజ్‌కుమార్‌ రావు 2017లో "న్యూటన్" సినిమాలో ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వ అధికారి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. అలాగే, ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఆస్కార్‌కు నామినేషన్ సాధించింది. ఎన్నికల్లో ఓటింగు శాతం పెంచేందుకు ఈసీతో కలిసి ఐకాన్‌గా ఎంపికైన వారు పనిచేస్తారు. గతంలో సినీ స్టార్‌లు పంకజ్‌ త్రిపాఠి, ఆమిర్‌ ఖాన్‌తో పాటు క్రీడా దిగ్గజాలు సచిన్‌ తెందూల్కర్‌, ఎం.ఎస్‌ ధోనీ, మేరీ కోమ్‌లను ఐకాన్‌లుగా పనిచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 16.1 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

No comments:

Post a Comment