ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.కోటిన్నర గెలిచిన ఎస్ఐ - నిబంధనలను అతిక్రమించారంటూ సస్పెండ్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 18 October 2023

ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.కోటిన్నర గెలిచిన ఎస్ఐ - నిబంధనలను అతిక్రమించారంటూ సస్పెండ్ !


హారాష్ట్రలోని పింప్రి చించ్​వాడ్​ పోలీస్​ కమిషనరేట్​కు చెందిన ఎస్ఐ సోమ్​నాథ్​ జెండే  డ్రీమ్ ​11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. మూడు నెలలుగా సోమ్​నాథ్​ డ్రీమ్​ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లాండ్​- బంగ్లాదేశ్ మ్యాచ్​లో సోమ్​నాథ్​ బెట్టింగ్​ వేశారు. మ్యాచ్​లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్​ను ఎంపిక చేసుకున్న ఆయన ఫాంటసీ గేమ్​లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. "కొన్ని నెలలుగా డ్రీమ్​ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఇంతవరకు సక్సెస్​ కాలేకపోయాను. మంగళవారం కూడా డ్రీమ్ ​11 టీమ్​ను ఎంచుకున్నాను. ఆ తర్వాత నా టీమ్​లో టాప్​లోకి వచ్చింది. వెంటనే రూ.1.5 కోట్ల గెలుచుకున్నట్లు మెసేజ్​ వచ్చింది. మొదట దానిని నమ్మలేదు. తర్వాత నమ్మాను. మొత్తానికి చాలా సంతోషంగా ఉంది" అని సోమ్​నాథ్ జెండే తెలిపారు. అయితే నిబంధనలకు అతిక్రమించి పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఎస్​ఐ సోమ్​నాథ్​ జెండేను విధుల్లో నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్​ మానే ప్రకటించారు. కోటిన్నర గెలుచుకుని వార్తల్లో నిలిచిన ఆయన, సస్పెండ్ అయ్యి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అక్టోబర్​ 10న విధుల్లో ఉండి ఇంగ్లాండ్​-బంగ్లాదేశ్​ మ్యాచ్​పై బెట్టింగ్​లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన సోమ్​నాథ్ రూ.కోటిన్నర గెలుచుకున్నారు. పోలీసులే బెట్టింగ్​కు పాల్పడడం వల్ల వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన పోలీసు శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన అధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి శాఖపరమైన విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు.

No comments:

Post a Comment