కేసీఆర్‌కి మంత్రి పదవి ఇప్పించా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 28 October 2023

కేసీఆర్‌కి మంత్రి పదవి ఇప్పించా !


ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని,1995లో కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించిన విషయం మరిచారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఖమ్మంలోని 9, 41వ డివిజన్లలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో తుమ్మల మాట్లాడారు. ''గోదావరి జలాలను మున్నేరు ద్వారా పాలేరుకు లిఫ్ట్‌ చేసి జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే నా కోరిక. అందుకే కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. 2018 ఎన్నికల్లో పాలేరులో నా ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసు. పువ్వాడ అజయ్‌ని మంత్రిని చేయడం కోసం మీ కుమారుడు.. నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడించారు. నాడు పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయాడానికి ఎవరూ ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను అంగీకరించాననే సంగతి మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం'' అని అన్నారు.

No comments:

Post a Comment