కేజ్రీవాల్ ఈడీ సమన్లు జారీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 31 October 2023

కేజ్రీవాల్ ఈడీ సమన్లు జారీ !


లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మద్యం కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌ను నవంబర్ 2న హాజరు కావాలని సమన్లలో ఈడీ కోరింది. ఆప్‌ ను అంతం చేయాలనే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, అందుకే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిందని ఆప్ విమర్శించింది. అయితే లిక్కర్ స్కామ్‌కు కేజ్రీవాల్ సూత్రధారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాషాయ పార్టీ డిమాండ్ చేసింది. ఆప్‌ను నిర్మూలించాలనే కుట్రతో కేంద్రం వ్యవహరిస్తోందని, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా అందివచ్చే అవకాశాన్ని బీజేపీ నేతలు విడిచిపెట్టడం లేదని, కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టి ఆప్ ఉనికి లేకుండా చేసేందుకు ఆప్ అధినేతపై తప్పుడు కేసు బనాయించారని ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ ఆరోపించారు. ఎలాగైనా కేజ్రీవాల్‌ను అడ్డు తొలగించుకోవాలని బీజేపీ కుట్రలకు తెరలేపిందని ఆప్ నేత సందీప్ పాఠక్ ఫైర్ అయ్యారు.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అడ్డు తొలగించుకోవడమే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని, ఢిల్లీ, పంజాబ్‌లో ఈ దిశగా ప్రయత్నాలు చేసి భంగపడ్డారని, గుజరాత్‌లోనూ ఆప్ కాలు మోపడంతో కాషాయ పాలకులకు దిక్కుతోచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతూ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ పీకల్లోతు కూరుకుపోయారని, వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

No comments:

Post a Comment