200 హెలికాప్టర్లతో ఇరాన్ విన్యాసాలు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 28 October 2023

200 హెలికాప్టర్లతో ఇరాన్ విన్యాసాలు

జ్రాయెల్-హమాస్ యుద్ధం ఓ వైపు భీకరంగా జరుగుతుండగా మరో వైపు ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రారంభించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య ముందుగా అనుకున్న ప్రకారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎస్ఫహాన్‌లో రెండు రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఇరాన్ ఆర్మీ కమాండర్లు అమీర్ చేషాక్ ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మాక్ డ్రిల్ వెనుక ఉన్న మొత్తం ఉద్దేశ్యం ఇరాన్ శత్రువులను హెచ్చరించడం. ఈ రోజుల్లో ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరాన్ హమాస్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తోంది. తన విన్యాసాలతో ఇరాన్ శత్రు దేశాలకు ఓ సంకేతాన్ని పంపించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఒక ప్రకటన విడుదల చేసి ఇజ్రాయెల్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ‘గాజాపై ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలకు పాల్పడటం ఆపకపోతే, అది అనేక ఇతర రంగాలలో కూడా పోరాడవలసి వస్తుంది’ అని అతను చెప్పాడు. గాజాపై ఈ యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఒకరికొకరు బద్ధ శత్రువులని తెలిసిందే. మధ్యప్రాచ్య నిపుణులు కూడా టెహ్రాన్-టెల్ అవీవ్ తమ శత్రుత్వంతో చాలా వేగంగా నష్టపోయాయని.. ఇరాన్ హమాస్‌తో చేతులు కలిపిందని, ఇప్పుడు దానికి బహిరంగ మద్దతు కూడగడుతోందని చెప్పారు. అంతేకాదు టెల్ అవీవ్‌ను కూడా హెచ్చరించాడు.

No comments:

Post a Comment