నవంబర్ 1కి సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 16 October 2023

నవంబర్ 1కి సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా


ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) వేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని అసైన్డ్‌ భూముల వ్యవహారం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ వేసిన క్వాష్‌ పిటిషన్లపై గతంలో హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, ఈ కేసులపై విచారణను రీ ఓపెన్‌ చేయాలని హైకోర్టులో పిటిషన్లు వేసింది ఏపీ సీఐడీ. దాంతో సీఐడీ అభ్యంతరాలపై కౌంటర్‌ దాఖలు చేస్తామని హైకోర్టుకు తెలిపారు చంద్రబాబు, నారాయణ తరపు లాయర్లు. దాంతో ఈ కేసుకి సంబంధించి సీఐడీ వేసిన పిటిషన్లపై విచారణ నవంబర్ 1కి వాయిదా పడింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిట్‌ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.. అలాగే చంద్రబాబును అరెస్ట్‌ చేయవద్దు అంటూ సీఐడీ పీటీ వారెంట్‌పై హైకోర్టు ఇచ్చిన స్టే, నేటితో ముగియనుంది.. దీంతో దానిపై కూడా ఈ రోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్‌ కోసం నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబశివరావు, ఆ సంస్థ ఉద్యోగి ప్రమీల వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది.

No comments:

Post a Comment