ఎమిరేట్స్‌ డ్రాలో 16 కోట్ల రూపాయల జాక్‌పాట్ కొట్టిన నటరాజన్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 21 October 2023

ఎమిరేట్స్‌ డ్రాలో 16 కోట్ల రూపాయల జాక్‌పాట్ కొట్టిన నటరాజన్‌ !


మిళనాడుకు చెందిన మాగేష్‌ కుమార్ నటరాజన్‌ ఎమిరేట్స్‌ డ్రాలో 16 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. ఎమిరేట్స్‌ డ్రాలో ఫాస్ట్‌ 5 గ్రాండ్‌ ప్రైజ్ నటరాజన్‌ సొంతమైంది. ఈ జాక్‌పాట్‌ కొట్టిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందని మొదటి వ్యక్తిగా మాగేష్‌ కుమార్‌ నటరాజన్‌ నిలిచారు. ఈ బహుమతి కింద ఆయనకు నెలకు సుమారు 5.6 లక్షలు రాబోతుంది. ఇది ఇలాగే 25 ఏళ్లపాటు కొనసాగుతుంది. మాగేష్‌ కుమార్‌ నటరాజన్‌ 2019 నుంచి నాలుగేళ్లపాటు సౌదీ అరేబియాలో పనిచేసేందుకు వెళ్లారు. అప్పటినుంచే లాటరీలపై ఆస్తకి ఉండటంతో లాటరీలను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. దాంతో ఇప్పడు భారీ బహుమతినే పొందాడు. ఎమిరేట్స్ డ్రాలో ఫాస్ట్ 5 గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ డబ్బుతో 25 ఏళ్ల పాటు ఈయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన తమిళనాడులోని అంబూరులో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. భారీ బహుమతి లభించిన తర్వాత నటరాజన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బాల్యం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించానని, ఇప్పడు నన్ను అదృష్టం వరించిందని, ఈ వచ్చిన డబ్బుతో తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వడంతోపాటు, సమాజంలో అవసరమైన వారికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. చదువుకునే రోజుల్లో నాకు ఎంతోమంది సహాయం చేశారు. ఇప్పుడు ఈ డబ్బుతో వారికి సహాయం చేస్తాను అని నటరాజన్‌ అంటున్నారు.

No comments:

Post a Comment