సనాతన ధర్మంపై దాడి ఇవాళ్టిది కాదు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 September 2023

సనాతన ధర్మంపై దాడి ఇవాళ్టిది కాదు !


ధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో నాథ్ ఆలయంలో ధ్వజస్తంభం ఆవిష్కరణ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మాట్లాడుతూ భారత్ లో సనాతన ధర్మం అనేది ఓ మతమని, సనాతన ధర్మంపై దాడి ఇవాళ్టిది కాదని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉదయనిధి వ్యాఖ్యల్ని తమకి అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా యోగీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అధికారం కోసం జీవించే వారు దానిని తుడిచివేయలేరన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి దాడికి గురవుతున్న సనాతన ధర్మాన్ని భారతదేశంలో నివసిస్తున్న కొందరు ఇప్పటికీ అవమానించడం దురదృష్టకరమని అన్నారు. ప్రాచీన కాలం నుంచి దాడులకు గురవుతున్న సనాతన ధర్మంలాగే భగవంతుడి ఉనికి, నిజస్వరూపం కూడా ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఈనాటికీ భారతదేశంలో నివసిస్తున్న చాలా మంది ప్రజలు సనాతన ధర్మాన్ని అవమానించడం దురదృష్టకరమన్నారు. వారు భారతీయ విలువలు, ఆదర్శాలు, సూత్రాలపై దాడి చేసే ఏ అవకాశాన్ని వదులుకోరన్నారు. రావణుడు కూడా భగవంతుని వాస్తవికతపై దాడి చేయడానికి ప్రయత్నించాడని, కానీ ఫలితం ఏమిటని యోగీ ప్రశ్నించారు. రావణుడు తన అహంతో నాశనం అయ్యాడన్నారు.

No comments:

Post a Comment