సనాతన ధర్మ వివాదానికి ఆద్యుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 September 2023

సనాతన ధర్మ వివాదానికి ఆద్యుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ !


నాతన ధర్మంపై జరుగుతున్న చర్చల మధ్య, హిందూ మతంలో వివక్ష గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మొదట లేవనెత్తారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆదివారం మాట్లాడుతూ, “కొన్ని రోజుల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందూ మతంలో వివక్ష అంశాన్ని లేవనెత్తడంతోనే సనాతన ధర్మంపై వివాదం మొదలైంది'' అని అన్నారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విపక్ష పార్టీ భారతదేశాన్ని నిరంతరం లక్ష్యంగా చేసుకుంటోంది. ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అలాగే దాని నిర్మూలించాలని అన్నారు. వాస్తవానికి హిందూమతంలోని కులవ్యవస్థ గురించి మోహన్ భగవత్ స్పందించారు. గతంలో కులవివక్ష లేదనే భావనకు కొంతమంది మద్దతు ఇస్తున్నారని, కానీ మన దేశంలో కులవివక్ష కారణంగా అన్యాయం జరిగిన మాట వాస్తవమని, దాన్ని ఈ దేశ ప్రజలు అంగీకరించాలని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ''ఏమున్నాయో వాటిని చెప్పి తీరాలి, ఏమీ లేవో అవి లేవని కూడా చెప్పాలి. మన దేశంలో గతంలో కుల వివక్ష లేదని కొందరు అంటున్నారు. దానికి మరికొంత మంది మద్దతు ఇస్తున్నారు. ఇది సరైంది కాదు. ఈ దేశంలో కుల వివక్ష ఉంది. కుల వివక్ష కారణంగా కొంత మంది ప్రజలకు అన్యాయం జరిగింది. దాన్ని మనం అంగీకరించి తీరాలి. అలాంటి తప్పులు జరక్కుండా చూడాలి'' అని అన్నారు. ఇక మన దేశానికి గొప్ప వారసత్వ సంపద ఉందని, దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భగవత్ పిలుపునిచ్చారు. ఇక దీన్ని ప్రస్తావిస్తూ సనాతన ధర్మ వివాదం భగవత్ వల్లే ప్రారంభమైందని పవన్ ఖేరా అన్నారు. కులం గురించి, కుల వివక్ష గురించి భగవత్ మాట్లాడటం వల్లే.. ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యాలు చేశారని ఆయన వెనకేసుకొచ్చారు. అయితే ‘బీజేపీ అసందర్భ ఉచ్చులో పడవద్దని’ పార్టీ నేతలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారని పవన్ ఖేరా గుర్తు చేశారు. “రాహుల్ గాంధీ సైద్ధాంతిక స్పష్టత ఆవశ్యకతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీజేపీ అసంబద్ధత ఉచ్చులో పడకుండా ఆయన మమ్మల్ని హెచ్చరించారు” అని అన్నారు.

No comments:

Post a Comment