ఇసుక రేణువంత అతి చిన్న కెమెరా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 September 2023

ఇసుక రేణువంత అతి చిన్న కెమెరా !


త్యంత సూక్ష్మంగా ఈ కెమెరాను వేలికొనపై మోయగలిగే బరువుంటుంది. చూడటానికి చిన్నదే అయినా ఉపయోగం మాత్రం ఊహించనంత. దీనిని అత్యంత అరుదైన శస్త్ర చికిత్సల్లో వాడతారు. ఇసుక రేణువంత పరిమాణంలో ఉండే ఈ కెమెరా శస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇటీవల ఇంటర్నెట్‌లో కేవలం 0.575 x 0.575 కొలతలతో ఒక చిన్న కెమెరా ఫొటో హల్ చల్ చేస్తోంది. ఈ సెన్సార్ ఇమేజ్ సోషల్ మీడియా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇది అత్యంత సూక్ష్మీకరణ సాంకేతికతలో గణనీయమైన పురోగతి. ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరాగా గిన్నిస్ రికార్డు సాధించిన ఈ పరికరాన్ని 'OV6948' అని పిలుస్తారు.దీనిని US ఆధారిత ఓమ్నివిజన్ టెక్నాలజీస్ సంస్థ తయారు చేసింది. ఇది 0.575mm x 0.575mm పరిమాణంతో "వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అతి చిన్న ఇమేజ్ సెన్సార్. శస్ర్తచికిత్సలో శరీరంలోని లోతైన నిర్మాణ సంబంధ కణాలను పరిశీలించేందుకు ఓమ్ని విజన్ ఈ వినూత్న మెడికల్ ఇమేజర్ ను అభివృద్ధి చేసింది. వైద్య ఇమేజింగ్ పరికరాల పునర్వినియోగం ద్వారా ఎదురయ్యే అనేక సవాళ్లను ఈ ఇమేజర్లు పరిష్కరించగలవు. 

No comments:

Post a Comment