చంద్రుడిపై నీరు ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 15 September 2023

చంద్రుడిపై నీరు ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడి !


చంద్రుడిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా చంద్రయాన్-1 గుర్తించింది. అయితే ఈ నీరు చంద్రుడిపైకి ఎలా చేరిందనేది ప్రశ్నగా మిగిలింది. చంద్రుడిపై నీటికి భూమి కారణమని తెలిసింది. హవాయ్ యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్లు చంద్రుడి ఉపరితలంలోని రాళ్లు, ఖనిజాలను విచ్చిన్నం చేయడం లేదా కరిగించడం వంటి చర్యకు కారణమవుతున్నాయని కనుగొన్నారు. చంద్రుడిపై నీటి సాంద్రత, నీటి పంపిణీ దాని నిర్మాణం, పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ అణ్వేషణకు నీటి వనరులను అందించడానికి ఈ పరిశోధనలు కీలకమని పరిశోధకులు చెప్పారు. సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్ లో ఉండే ప్రోటాన్ల వంటి అధిక శక్తి అణువుల చందమామ ఉపరితలాన్ని తాకినప్పుడు అక్కడ నీరు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని గతంలో ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే చంద్రుడు భూ అయస్కాంత వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు సోలార్ విండ్ తాకదు. అలాంటి సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. చంద్రయాన్ 1 మిషన్ లో మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం, ఇమేజింగ్ స్బెక్ట్రోమీటర్ ద్వారా సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను విశ్లేషించారు. ప్లాస్మా షీట్ కలిగిన భూ మాగ్నెటోటైట్ గుండా చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు నీటి నిర్మాణంలో కలిగే మార్పులను వారు ప్రత్యేకంగా అంచనా వేశారు. భూ అయస్కాంత క్షేత్రం గుండా వెళ్తున్నప్పుడు కూడా, చంద్రుడు సోలార్ విండ్ కు ప్రభావితం అయినట్లే అంతే సమానంగా నీటి ఆనవాళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్స్ లోని ప్రోటాన్లు ఢీకొట్టినట్టే, చంద్రుడు భూమి అయస్కాంత సంరక్షణలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియే నీరు ఏర్పడటానికి సహాయం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్ల రేడియేషన్ కూడా సోలార్ విండ్ లోని ప్రోటాన్ల వలే పనిచేస్తుందని పరిశోధకలు తేల్చారు. చంద్రయాన్-1 ఇస్రో ప్రయోగించిన తొలి మూన్ మిషన్. ఈ మిషన్ ని 2008లో ప్రారంభించింది. దీని ద్వారానే చంద్రుడిపై నీరు ఉందని తెలిసింది. ఈ మిషన్ లో ఓ ఆర్బిటార్, ఇంపాక్టర్ ఉన్నాయి. ఆ తరువాత చంద్రయాన్ 2, ఇటీవల చంద్రయాన్-3ని ఇస్రో నిర్వహించింది. చంద్రయాన్ -3 ద్వారా జాబిల్లిని చేరిన నాలుగో దేశంగా అమెరికా, రష్యా, చైనాల తరువాత భారత్ నిలిచింది. చంద్రుడి దక్షిణ ధృవంపైకి చేరిన మొదటి దేశంగా భారత్ ఘనత సాధించింది.

No comments:

Post a Comment