ఇండియా కూటమిలో చేరనున్న భీమ్ ఆర్మీ

Telugu Lo Computer
0


ఇండియా కూటమిలో భీమ్ ఆర్మీ కొత్తగా చేరనున్నది. చంద్ర శేఖర్ ఆజాద్ నాయకత్వంలోని భీమ్ ఆర్మీని ఇండియా కూటమిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రీయ లోక్ దళ్ ప్రయత్నాలు సాగిస్తోంది. చంద్రశేఖర్ ఆజాద్‌ను ఇండియా కూటమిలో చేర్చుకోవడం ద్వారా దళిత ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని కూటమి భావిస్తోంది. ఆజాద్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని రాష్ట్రీయ లోక్ దళ్ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి తెలిపారు. అయితే ప్రతిపక్ష కూటమిలో భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఎప్పుడు చేరతారన్నద ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదు. ఇండియా కూటమిలో చేరికలు ఇప్పటికే మొదలయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని పార్టీలు కూటమిలో చేరతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతికి ఉత్తర్ ప్రదేశ్‌లో దళితులు దూరం అవుతున్న నేపథ్యంలో చంద్రశేఖర్ ఆజాద్ ద్వారా ఆ ఓటర్లను తమ కూటమి వైపు ఆకట్టుకోవచ్చని ఆర్‌ఎల్‌డి వర్గాలు తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)