ప్రతి మతాన్ని గౌరవించాలి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 4 September 2023

ప్రతి మతాన్ని గౌరవించాలి !


మిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ.. ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)ను కూడా లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. “తమిళనాడు ప్రజలను, సీఎం ఎంకె స్టాలిన్‌ను తాను చాలా గౌరవిస్తానని మమతా బెనర్జీ తెలిపింది. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉంటాయన్నారు. భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని ఒక వర్గానికి హాని కలిగించే ఏ విషయంలోనూ తాము జోక్యం చేసుకోమన్నారు. సనాతన ధర్మాన్ని గౌరవిస్తామని, పూజలు చేసే పూజారులకు పింఛన్‌ ఇస్తున్నామని తెలిపారు. బెంగాల్‌లో దుర్గాపూజను పెద్ద ఎత్తున జరుపుకుంటామని, గుళ్లు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలకు వెళ్తామని.. ప్రతి మతాన్ని గౌరవిస్తామని మమతా అన్నారు. పెద్ద, చిన్న వర్గాల ప్రజల మధ్య అసమ్మతిని కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ప్రతి ఒక్కరికీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.


No comments:

Post a Comment