జంతువుల కోసం హెల్త్ ఇనిస్టిట్యూట్ ?

Telugu Lo Computer
0


జంతువుల కోసం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ముసాయిదా తయారు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అందుకు వివిధ సంస్థల నుంచి ముఖ్యమైన సూచనలను కోరినట్టు సమాచారం. ఈ సంస్థ ఉద్దేశ్యం అన్ని రకాల జంతువులకు చికిత్స అందించడం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్‌లో అన్ని రకాల జంతువులకు చికిత్స చేయడానికి 2వందల నుంచి 5వందల సీట్లు ఉంటాయి. ఆసుపత్రిలో స్వదేశీ, అన్యదేశ జంతువుల చికిత్స కోసం ప్రత్యేక విభాగాలు ఉండనున్నాయి. ఇందులో శస్త్రచికిత్స, నేత్ర వైద్యం, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, సాఫ్ట్ టిష్యూ కల్చర్, న్యూటర్ సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ విభాగాలు జంతువుల చికిత్స కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఉంటాయి. ఈ వెటర్నరీ ఇన్‌స్టిట్యూట్‌లో జంతువుల చికిత్సపైనే కాకుండా విద్య, పరిశోధనలపై కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అంటే ఇక్కడ వెటర్నరీ డాక్టర్లకు స్టడీ ఉంటుందని, పరిశోధనలు కూడా చేస్తారన్నమాట. దీని కోసం, అభ్యర్థులు నీట్ వంటి ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశం పొందుతారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్‌ని రూపొందించడం వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటంటే ప్రతి సంవత్సరం అనేక జంతువులను అంటువ్యాధుల నుంచి రక్షించడం. అంతే కాకుండా జంతువులకు సంబంధించిన వివిధ వ్యాధులపై ఇక్కడ పరిశోధనలు చేసి నివారణను కనుగొనవచ్చు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ కోసం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ప్రతిపాదనను అందించడం గమనార్హం. ముసాయిదా ప్రతిపాదనను అధికారిక ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గానికి పంపనున్నారు. ఆ తరువాత, మొత్తం ఖర్చు, నిధులు, ఇతర అవసరాలతో పాటు దీని కోసం పనులు ప్రారంభం కానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)