శనగ పిండి, రోజ్ వాటర్ స్క్రబ్: చర్మ సమస్యల నివారణ కోసం ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగ పిండి తీసుకుని, దానికి కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. అది స్క్రబ్ పేస్ట్‌లా మారాక ముఖం, మెడపై సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయండి. ఇలా చర్మంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత శుభ్రం చేయండి. మీరు వారానికి రెండు సార్లు శనగ పిండి & రోజ్ వాటర్ స్క్రబ్ ఉపయోగించవచ్చు.
శనగ పిండి, పచ్చి మిల్క్ ఫేస్ స్క్రబ్: మెరిసే చర్మం కోసం ఒక గిన్నెలో 2 చెంచాల శనగ పిండిని, కొద్దిగా పచ్చి పాలు కలపి పేస్ట్‌లా చేయండి. ఆ స్క్రబ్‌ని చర్మానికి బాగా మసాజ్ చేసి, అలా కనీసం పది నిమిషాలు వదిలి వేయండి. తర్వాత దాన్ని కడిగేయండి. ఈ స్క్రబ్ మీ చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ.. ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.
శనగ పిండి, నిమ్మ రసం స్క్రబ్: చర్మానికి చాలా అవసరమైన స్క్రబ్ ఇది. ఇందు కోసం ఓ గిన్నెలో రెండు చెండాల శనగ పిండిని, కొద్దిగా నిమ్మ రసం కలపండి. దానికి కొంత నీరు కలిపి స్క్రబ్‌గా చేసుకోండి. ఈ స్క్రబ్‌తో చర్మాన్ని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత ముఖం శుభ్రం చేసుకోండి.
శనగ పిండి, కీరదోస రసం స్క్రబ్: శనగ పిండితో పాటు కీర దోస కూడా చర్మాన్ని సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులోని పోషకాలే అందుకు కారణం. ఇక శనగ పిండి, కీర దోస రసంతో స్క్రబ్ తయారు చేసుకునేందుకు కీర దోసం రసంలో కొద్దిగా శనగ పిండి కలిపి పేస్ట్‌లా చేసుకోండి. దాన్ని ముఖం, మెడపై మసాజ్ చేసుకోండి. ఇలా కొద్ది సేపు చేయడం వల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. మృదువు, ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందడానికి, వారానికి రెండు సార్లు ఈ హోమ్‌మేడ్ ఫేస్ స్క్రబ్‌ని ఉపయోగించండి.
No comments:
Post a Comment