దేవెగౌడ మనసు ప్రధాని నరేంద్ర మోడీ వైపు కదిలింది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 9 September 2023

దేవెగౌడ మనసు ప్రధాని నరేంద్ర మోడీ వైపు కదిలింది !


ర్ణాటకలోని చిక్కబళ్లాపురలో కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల దేవెగౌడ మనసు ప్రధాని నరేంద్ర మోడీ వైపు కదిలిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జేడీఎస్‏కు ప్రజాబలం తగ్గుతోందని బీజేపీవైపు వెళ్లారని చెప్పారు. జేడీఎస్‌ వారు గెలవరని, మరొకరిని గెలవనివ్వరని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేదని, పొత్తుతో కాంగ్రెస్‌ గెలిచేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. 'ఇండియా' కూటమికి దేశంలోని అన్ని ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయని, కానీ దేవేగౌడ వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీకి జేడీఎస్‌ నేత కుమారస్వామి అధికార ప్రతినిధిగా మారారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు అవుతున్నా ప్రతిపక్షనేతను ఎంపిక చేయడం సాధ్యం కాలేదన్నారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మహ్మద్‌ జిన్నాలాంటివారని మండిపడ్డారు. 1947లో భారత్‌ నుంచి పాకిస్థాన్‌ విభజన అయ్యాక భారత్‌ను 'ఇండియా' గా నామకరణం చేసేందుకు బ్రిటీష్‌ వారితో మహ్మద్‌ జిన్నా వ్యతిరేకించారన్నారు. ప్రస్తుతం ఇండియా పేరును నరేంద్రమోదీ మార్చేందుకు సిద్ధం కావడం మన దురదృష్టమన్నారు. కాగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర ద్వారా సంఘ సంస్థలు, మేధావులతోపాటు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో సామాజిక సామరస్యం కుశించుకుపోయిందన్నారు.

No comments:

Post a Comment