రైళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 September 2023

రైళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ !


రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది. ఈ సాంకేతికతతో కూడిన ఒక డివైజ్ ను ఇప్పుడు రైలు డ్రైవర్ల క్యాబిన్ లలో అమరుస్తున్నారు. ఒకవేళ రైలు డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారుకుంటున్నారని అనిపిస్తే .. వారు కనురెప్పలు వాలుస్తున్నారని అనిపిస్తే ఈ డివైజ్‌ ఇట్టే గుర్తిస్తుంది. వెంటనే సౌండ్స్ చేసి వారిని అలర్ట్ చేస్తుంది. వారు రెస్పాండ్ కాకుంటే.. అవసరమైతే రైలుకు ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేస్తుంది. ఈ టెక్నాలజీని తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే వినియోగంలోకి తెచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ పరికరానికి 'రైల్వే డ్రైవర్‌ అసిస్టెన్సీ సిస్టమ్‌' (RDAS) అని పేరు పెట్టారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 20 గూడ్స్‌ రవాణా ఇంజిన్లు (WAG9), ప్యాసెంజర్‌ రైలు ఇంజిన్లలో (WAP7) దీన్ని వినియోగించనున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత నివేదిక ఇవ్వాలని ఆయా రైల్వే జోన్లకు నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే బోర్డు సూచించింది. ఆ డివైజ్ ను మరింత మెరుగుపర్చేందుకు సూచనలు కూడా ఇవ్వాలని వెల్లడించింది. ది ఇండియన్‌ రైల్వే లోకో రన్నింగ్‌మెన్‌ ఆర్గనైజేషన్‌ మాత్రం ఈ పరికరాన్ని వ్యతిరేకిస్తోంది.

No comments:

Post a Comment