ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర !

Telugu Lo Computer
0


గత నెలలో ఆకాశాన్ని తాకిన టమాటా జీవితకాలంలో ఎన్నడూ ప్రజలు చూడని రేట్లకు అమ్ముడైంది. అయితే ఆ సమయంలో అధిక వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టం జరగటంతో డిమాండ్ సప్లై వ్యత్యాసం రైతులను కోటీశ్వరులుగా మార్చేసింది. అనేక సార్లు టమాటా ధరలు పతనమై రోడ్ల పక్కన పంటను పారబోసిన చాలా మంది రైతులకు ఒక్కసారిగా మంచి కాలం వచ్చింది. టమాటా రైతులకు ఆగస్టు మాసం ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు  చాలా మంది రైతులు వేసిన పంట చేతికి రావటంతో మార్కెట్లలోకి సరకు విపరీతంగా వస్తోంది. ఇది ధరల పతనానికి దారితీసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టమాటాకు ప్రధాన మార్కెట్లలో ఒకటైన మధనపల్లెలో కిలో ధర రూ.7 పలకటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టన్నుల్లో టమాటా ఒక్కసారిగా మార్కెట్లోకి రావటం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఇక్కడికి రాకపోవటం వంటి కారణాలు ధరల పతనానికి దారితీశాయని రైతులు వాపోతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)