పోలీసుల నిర్బంధంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 August 2023

పోలీసుల నిర్బంధంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారి !


న్యూఢిల్లీలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన ఢిల్లీ ప్రభుత్వ అధికారి ప్రమోదయ్ ఖాఖాను ఢిల్లీ పోలీస్‌లు సోమవారం నిర్బంధంలోకి తీసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రమోదయ్‌తోపాటు ఆయనకు సహకరించారనే ఆరోపణలున్న అతని భార్యను కూడా పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఇద్దరినీ ప్రస్తుతం ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచి ఇంటరాగేట్ చేస్తున్నట్టు నార్త్ ఢిల్లీ డీసీపీ సాగర్ సింగ్ కల్సి చెప్పారు. బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం సాగిస్తున్నట్టు ప్రమోదయ్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా, బాలిక గర్భవతి కాగానే గర్భస్రావం చేయించేందుకు సహకరించిందనే ఆరోపణలను ఆయన భార్య ఎదుర్కొంటోంది. మెజిస్ట్రేట్ ముందు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం కింద నిందితులపై సీఆర్‌పీఎఫ్ సెక్షన్ 164 కింద కేసు నమోదు చేశారు.బాధితురాలి తండ్రి 2020 అక్టోబర్ 1న చనిపోయారు. దాంతో అతడి స్నేహితుడైన ప్రయోదయ్ బాలిక బాగోగులు చూసుకుంటానంటూ తన ఇంటికి తీసుకెళ్లారు. 2020 నవంబర్ 2021 జనవరి మధ్య పలుమార్లు ఆమెపై అత్యాచారం జరిపినట్టు పోలీస్‌లు చెబుతున్నారు. ఈ విషయం బయటపడకుండా అతని భార్య గర్భనిరోధక మాత్రలు ఇచ్చి బాలికకు అబార్షన్ అయ్యేలా చేసింది. ఇటీవల అనారోగ్యానికి గురై స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలు తనపై గతంలో జరిగిన దారుణాన్ని అక్కడి కౌన్సిలర్‌కు వివరించడంతో అసలు విషయం బయటపడింది. ప్రమోదయ్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఆదేశాలిచ్చారు.

No comments:

Post a Comment