కోడలు కోసం అత్త కిడ్నీ త్యాగం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 August 2023

కోడలు కోసం అత్త కిడ్నీ త్యాగం !


ముంబయికి చెందిన ప్రభా కాంతిలాల్ మోటా (70). ఆమె కోడలు అమిషా మోటాకు అనారోగ్యం కారణంగా కిడ్నీ పాడైంది. అమిషా భర్త జితేష్ మోటా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆయనకు డయాబెటిస్‌ ఉండటంతో ఆయన ఆరోగ్య రీత్యా డాక్టర్లు అంగీకరించలేదు. తర్వాత ప్రభా తన కిడ్నీని కోడలికి ఇస్తాననడంతో ఆమె కుమారులు భయపడ్డారు. అమిషాకు కిడ్నీ అమర్చడానికి ఇంకా సమయం ఉందని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని కుటుంబం, డాక్టర్లు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా ఆమె కిడ్నీ ఇవ్వడానికి వెనుకాడలేదు. నేను చాలా ఫిట్ గా (ఆరోగ్యంగా) ఉన్నాను. మీరు భయపడవద్దు. అమిషా నా కోడలు కాదు నా కుమార్తె .. బిడ్డ ఆరోగ్యం కంటే తల్లికి ఏది ముఖ్యం కాదని తెలిపింది. కిడ్నీలు పాడై బాధపడుతున్న వారికీ దాతలు ముందుకు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునివ్వాలని కోరుతాను అని చెప్పింది. ఆగస్టు 1న ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రభా తన కోడలు అమిషాకు కిడ్నీను దానం చేసింది. ఆనంతరం ఆసుపత్రి నుంచి వచ్చాక కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్స్‌ చేసుకుంది. ఏడు పదుల వయసులో కూడా తన శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయిన బాధ ఆమెలో ఏ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సందర్భంగా ప్రభా కాంతిలాల్‌ వ్యక్తిగత డాక్టర్‌ చంద్రకాంత్‌ మాట్లాడుతూ.. ' నా 44 ఏళ్ల వైద్య వృత్తి లో చాలామంది అవయవ దాతలు తమ పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబీకులకు ఇస్తారు. కానీ అత్త, కోడలికి కిడ్నీని దానం చేయడం అరుదు. ఆమె అత్తలందరికీ ఆదర్శం' అని తెలిపారు.

No comments:

Post a Comment