నేలపై పడ్డ భారత త్రివర్ణ పతాకాన్ని తీసి జేబులో పెట్టుకున్న మోడీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 23 August 2023

నేలపై పడ్డ భారత త్రివర్ణ పతాకాన్ని తీసి జేబులో పెట్టుకున్న మోడీ !


క్షిణాఫ్రికాలోని జోహాన్స్ బర్గ్ లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో గ్రూప్ ఫోటో సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. నేలపై పడ్డ భారత త్రివర్ణ పతాకాన్ని గుర్తించి, జాగ్రత్తగా తీసి జేబులో పెట్టుకున్నారు. మోడీని గమనించిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా తమ దేశ జెండాను తీసి అక్కడున్న సిబ్బందిని పిలిచి వారికిచ్చేశారు. కానీ మోడీ  మాత్రం జాతీయ జెండాను అలాగే తన జేబులో పెట్టుకుంటానని చెప్పడం  ఆయన నాయకత్వ నిలకడకు, దేశంపై, జాతీయ జెండాపై గౌరవాన్ని వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 22న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. అంతకుముందు జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ అని అన్నారు. త్వరలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని మోడీ  చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచానికి గ్రోత్ ఇంజిన్‌గా అవతరించనుందని ఈ సందర్భంగా ప్రధాని ఉద్ఘాటించారు.

No comments:

Post a Comment