యుద్ధఖైదీల పట్ల అమానుషం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 2 August 2023

యుద్ధఖైదీల పట్ల అమానుషం !


ష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో బందీలుగా చెరపట్టబడిన వారిని రష్యా సాయుధ బృందాలు అత్యంత క్రూరంగా హింసిస్తున్నట్లు చెబుతున్నారు ఉక్రెయిన్ అధికారులు. అంతర్జాతీయ మానవతా న్యాయ సంస్థ గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 18 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో మొత్తం 97,000 నేరాలు నమోదుకాగా వాటిలో 220 కేసులలో ఇప్పటికే తీర్పులిచ్చాయి స్థానిక న్యాయస్థానాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కూడా అరెస్టు చేయాలని కొన్ని న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. కానీ క్రెమ్లిన్ వర్గాలు ఈ తీర్పులకు స్పందిస్తూ అవి దేశరక్షణలో భాగంగా జరిగిన స్పెషల్ మిలటరీ ఆపరేషన్ అంటూ చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉండగా బ్రిటీష్, ఐరోపా సంయుక్త దేశాలు, అమెరికా సహకారంతో నడిచే మొబైల్ జస్టిస్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖేర్సన్ పరిసర ప్రాంతంలోని 35 చోట్ల 320 యుద్ధ నేరాలు ఆరోపించబడ్డాయని తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ల తాజా విచారణలో ప్రకారం రష్యా రాజకీయ నాయకుడితో ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు చేతులు కలిపి ఖేర్సన్ నుండి ఎందరో అనాధలను ఖైదీలుగా తరలించారు. వారినందరినీ చిత్రహింసలకు గురిచేస్తూ రష్యా సైన్యం లైంగిక దాడులకు కూడా పాల్పడుతోందన్నారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు ప్రాసిక్యూట్ చేసిన 36 మంది మాత్రం కరెంటు షాక్ ఇవ్వడం, చావబాదడం తోపాటు అత్యాచారానికి పాల్పడతామంటూ బెదిరించినట్టు తెలిపారు. గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ న్యాయ సలహాదారు మాత్రం ఖైదీలపై రష్యా ఆకృత్యాలపై పూర్తి స్థాయి నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు.   https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment