కూటమి మూడవ సమావేశానికి హాజరవుతాం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 August 2023

కూటమి మూడవ సమావేశానికి హాజరవుతాం !


ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడవ సమావేశానికి ఆప్‌ హాజరవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం ప్రకటించారు. ఆగస్ట్‌ 31న ముంబయిలో సమావేశం కానున్నట్లు 'ఇండియా' కూటమి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ''ముంబయి సమావేశంలో పాల్గొని, ప్రతిపక్షాల వ్యూహం ఏమిటో తెలుసుకుంటాం'' అని కేజ్రీవాల్‌ మీడియాతో అన్నారు. కేంద్రపాలిత ప్రాంతంలోని ఏడు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని ఢిల్లీ యూనిట్‌ని పార్టీ ఆదేశించిందని ఇటీవల కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారు. ఈ ప్రకటనపై కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య ట్వీట్లవార్‌ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో చర్చ జరగలేదని కాంగ్రెస్‌ ఢిల్లీ ఇన్‌చార్జ్‌ దీపక్‌ బబారియా స్పష్టం చేసిన తర్వాత ఈ వార్‌ ముగిసింది. అయితే ఇండియా కూటమిలో ఆప్‌ను భాగస్వామ్యం చేసేందుకే ఈ బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ బిల్లుకి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించకపోవడంతో ఇండియా కూటమి మొదటి సమావేశానికి ఆప్‌ హాజరుకాలేదు. జులై 17-18 తేదీల మధ్య బెంగళూరులో నిర్వహించిన రెండో సమావేశానికి ఆప్‌ హాజరైన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment