ఏపీలో 875 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 25 August 2023

ఏపీలో 875 ఉద్యోగాలకు నోటిఫికేషన్


ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం సేకరణ కోసం ఈ నియామకాలను చేపట్టింది. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ సమయం 2 నెలలు. టెక్నికల్ అసిస్టెంట్ 275, డేటా ఎంట్రీ ఆపరేటర్ 275, హెల్పర్ 275.  టెక్నికల్ అసిస్టెంట్ లకు అగ్రికల్చర్, మైక్రోబయోలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, BZC తదితర విభాగాల్లో బ్యాచలర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయస్సు 21-40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితి 45 ఏళ్లు. డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు  డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ లో పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయస్సు 21-40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయస్సు 45 ఏళ్లు. హెల్పర్స్ కు 8-10వ తరగతి విద్యార్హత కలిగిన వారికి అవకాశం ఉంటుంది. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా తమ దరఖాస్తులను కావాల్సిన ధ్రువపత్రాల జీరాక్స్ కాపీలను జత చేసి డిస్ట్రిక్ట్ సప్లైస్ మేనేజర్, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలక్టరేట్ కాంపౌండ్, కాకినాడ  చిరునామాకు సెప్టెంబర్ 2లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.


No comments:

Post a Comment