టాలీవుడ్‌లో సంజయ్‌ దత్‌ రీ ఎంట్రీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 29 July 2023

టాలీవుడ్‌లో సంజయ్‌ దత్‌ రీ ఎంట్రీ !


క్కినేని నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ సినిమాలో సంజయ్‌ దత్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చాడు. కాగా ఈ సినిమా పాతికేళ్ల కిందట వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌తో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. గత రెండు, మూడు రోజులుగా రామ్‌-పూరీ కాంబోలో తెరకెక్కుతున్న బ్లాక్‌ బస్టర్‌ సీక్వెల్‌ డబుల్‌ ఇస్మార్ట్‌లో సంజయ్‌ దత్ విలన్‌గా చేస్తున్నాడని తెగ వార్తలు పుట్టుకొచ్చాయి. కాగా ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్‌ తాజాగా ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో సంజయ్‌ బిగ్‌ బుల్‌గా కనిపించనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. బ్లాక్‌ కలర్‌ క్లాస్‌ సూట్‌ వేసుకుని సిగర్‌ అంటించుకుంటూ మాస్‌ అవతారంలో సంజయ్‌ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. పూరి సినిమాలో ఈ రేంజ్‌లో ప్రతినాయకుడి లుక్‌ చూసి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. లైగర్‌ సినిమాలా ఏళ్లు తరబడి చేయకుండా ఈ ఏడాది చివరి కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ఆపై రెండు నెలలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు, ప్రమోషన్‌లు గట్రా చేయాలని పూరి ప్లాన్‌ చేస్తున్నాడట. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.   https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment