చదువు జీవితాలను మార్చగలదనడానికి నిదర్శనం కిరణ్‌ కుర్మవార్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 30 July 2023

చదువు జీవితాలను మార్చగలదనడానికి నిదర్శనం కిరణ్‌ కుర్మవార్‌ !


హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన కిరణ్‌ కుర్మవార్‌ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తన తండ్రి రమేష్‌ డ్రైవర్‌గా పని చేసేవారు. కిరణ్‌ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీని కూడా అందుకొన్నారు. విదేశాల్లో చదువుకోవాలని, తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చిన్నప్పటి నుంచి కలలుకన్నారామె. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఢిల్లీకి వెళ్లి ఓ చిరు ఉద్యోగంలో చేరి చదువు కొనసాగించారు. అదే సమయంలో తన తండ్రికి ప్రమాదం జరగడంతో కుటుంబ భారం కిరణ్‌పై పడింది. దీంతో కిరణ్‌ తిరిగి గ్రామానికి వెళ్లారు. తన తండ్రి బదులు తానే టాక్సీ డ్రైవర్‌గా మారారు. ఆడపిల్ల డ్రైవరా ! అంటూ చాలా మంది పెదవి విరిచారు. దీంతో కొన్నాళ్లు సమస్యలు ఎదుర్కొన్నారు. నిత్యం రేగుంట నుంచి సిరోంచా వరకు 140 కిలోమీటర్లు టాక్సీ నడిపేవారు. నాగ్‌పూర్‌, ముంబయి వంటి దూర ప్రాంతాలకు కూడా వెళ్లేవారు. అలా ఉదయం పనిచేస్తూ రాత్రిళ్లు చదువుకునేవారు. తండ్రి కోలుకోవడంతో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టారు. దీంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న యువ మహిళా టాక్సీ డ్రైవర్‌గా నోబల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ గుర్తించింది. వివిధ ఎన్‌జీవోల నుంచి ఇప్పటి వరకు 18 అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె పేరుపై ఆరు రికార్డులు కూడా ఉన్నాయి. విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండేకు దరఖాస్తు అందించారు. ఆయన సహకారంతో స్కాలర్‌షిప్‌ మంజూరైంది. త్వరలో యూకేకు వెళ్లనున్నారు. ''మాది 500 మంది ఉన్న కుగ్రామం. ఏ ఒక్కరూ చదువుకోలేదు. మా గ్రామంలో చదువుకున్న తొలి యువతిని నేనే. చదువు ప్రతి ఒక్కరి జీవితాలను మార్చగలదు. దాని శక్తిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈ డబ్బుతో యూకే వెళ్లి ఏడాదిపాటు ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసి.. రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వస్తాను. నా చదువును గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తాను. ప్రతి ఒక్కరినీ విద్యావంతులను చేయాలన్నదే నా లక్ష్యం. నాకు సహకారం అందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు'' అని కిరణ్‌ పేర్కొన్నారు.  https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment