పినరయి విజయన్‌కి హైకోర్టు నోటీసులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 22 May 2023

పినరయి విజయన్‌కి హైకోర్టు నోటీసులు !


డాక్టర్ వందనా దాస్ హత్యకు సంబంధించిన కేసులో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొట్టాయం జిల్లాలోని కడుతురుతి ప్రాంతానికి చెందిన డాక్టర్ వందనా దాస్ తల్లిదండ్రుల ఏకైక సంతానం. యువ వైద్యురాలు డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి కత్తి దాడి చేశాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించింది. అయితే, డాక్టర్‌ వందనా దాస్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యానంతరం దాఖలైన సుమోటో కేసుతో పిటిషన్‌ను ట్యాగ్‌ చేయాలని ఆదేశించింది.


No comments:

Post a Comment