దీన్ని చిత్రీకరించే సత్తా ఉందా ?

Telugu Lo Computer
0


కేరళలోని కాసర్ గఢ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్లా, ఖదీజా అనే మస్లిం దంపతులు నివసిస్తున్నారు. 10 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులు కోల్పోయిన రాజేశ్వరీని వీరు దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఆమెకు 22 ఏళ్లు రాగానే వరుడిని వెతికి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు. కేరళలోని భగవతి ఆలయంలో రాజేశ్వరి పెళ్లి చేసిన అబ్దుల్లా, ఖదీజా, దానికి హిందూ, ముస్లింలను ఆహ్వానించారు.హిందూ, ముస్లింలకు చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో విష్ణు ప్రసాద్‌తో రాజేశ్వరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఈ పెళ్లిపై స్పందించారు. ఎన్సీపీ నేత జితేంద్ర అవ్హాద్ ట్విటర్‌లో దీనికి సంబంధించిన పోస్టు చేసి దాని వెనుక జరిగిన కథను వివరించారు. 'దీన్ని చిత్రీకరించే సత్తా ఉందా? నెగెటివ్ విషయాలు మాత్రమే చూపిస్తూ మతకల్లోలాను సృష్టించేందుకు 100 శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయి'అంటూ ట్వీట్ చేశారు. కాగా, మరికొంత 'ది కేరళ స్టోరీస్' అంటే ఇది డైరెక్టర్ గారు మీరు చేయవలసిన సినిమా ఇది అని ట్వీట్ చేశారు. సెక్యులర్ భారతదేశానికి ఉదాహరణ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.కాగా, ఈ పెళ్లి రెండేళ్ల క్రితం జరగ్గా.. 'ది కేరళ స్టోరీ' సినిమా కారణంగా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటువంటి ఓ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ షేర్ చేశారు. 'ది కేరళ స్టోరీ' సినిమాలో చూపించినట్టు కేరళలో పరిస్థితులు లేవని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అదంతా కట్టుకథే అని చాలా మంది భావిస్తున్నారు.

केरळमधील कासरगोड येथील अब्दुल्ला आणि त्याची पत्नी खदिजा यांनी 10 वर्षांच्या हिंदू मुलीला दत्तक घेतले जिने तिचे पालक गमावले होते, ती आता 22 वर्षांची आहे. अब्दुल्ला आणि त्याची पत्नी खदिजा यांनी तिचे लग्न एका हिंदू मुलाशी पूर्ण हिंदू विधींनी लावून दिले. यावर चित्रपट काढण्याची क्षमता तुमच्यात आहे का? नकारात्मक गोष्टी फक्त दाखवायचा प्रयत्न चालू आहे...देशात जातीय दंगली कशा घडवता येतील हा प्रयत्न 100% चालू आहे...

Post a Comment

0Comments

Post a Comment (0)