టీవీ నటుడు నీతేష్ పాండే అనుమానాస్పద మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఇగత్‌పురిలో ఓ హోటల్ గదిలో ప్రముఖ టీవీ నటుడు నీతేష్ పాండే ఈ తెల్లవారు జామున నిర్జీవంగా కనిపించారు. ఆయనకు భార్య అర్పిత పాండే ఉన్నారు.  అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గుండెపోటు సంభవించడం వల్ల మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. నితేష్ పాండే స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్. ముంబైలో స్థిరపడ్డారు. 1990లో నాటకరంగంలో అడుగుపెట్టారు. పలు నాటకాల్లో నటించారు. 1995లో తేజాస్ అనే సీరియల్‌లో డిటెక్టివ్‌గా నటించారు. అది ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. బుల్లితెరపై బిజీ నటుడయ్యారు. సాయా, అస్తిత్వ.. ఏక్ ప్రేమ్ కహానీ, సునయన, కుఛ్ తో లోగ్ కహేంగే, ఇండియావాలీ మా, హీరో- గాయబ్ మోడ్ ఆన్ వంటి సీరియల్‌లో నటించారు. బాజీ చిత్రంతో నితేష్ పాండే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. బధాయి దో, రంగూన్, మడారి, హంటర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, దబాంగ్ 2, ఓం శాంతి ఓం, మేరే యార్ కీ షాదీ హై వంటి సినిమాల్లో నటించారు. 1998లో అశ్విని కల్సేకర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2002లో ఆమెతో విడిపోయారు. ఆ తరువాత తోటి నటి అర్పిత పాండేను పెళ్లాడారు. ప్రస్తుతం నితేష్ పాండే నటిస్తోన్న సీరియల్.. అనుపమ. స్టార్ ప్లస్ ఛానల్‌లో ఇది టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్‌కు చెందిన కొన్ని సన్నివేశాలను నాసిక్ జిల్లాలోని ఇగత్‌పురిలో చిత్రీకరిస్తోంది యూనిట్. యూనిట్‌తో కలిసి ఇగత్‌పురిలోని ఓ హోటల్‌లో బస చేశారాయన. ఈ తెల్లవారు జామున అనుమానాస్పద స్థితిలో మరణించారు. గది తలుపులు ఎంతసేపటికీ తెరవకపోవడంతో యూనిట్ సభ్యులు పోలీసులు సమాచారం ఇచ్చారు యూనిట్ సభ్యులు. డూప్లికేట్ తాళం చెవి ద్వారా తలుపులు తెరిచి చూడగా నిర్జీవ స్థితిలో కనిపించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. గుండెపోటుతో మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్ మార్టమ్ తరువాత ఆయన మరణానికి అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)