భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్నకాంగ్రెస్ హామీపై ప్రధాని, వీహెచ్పీ విమర్శలు !

Telugu Lo Computer
0


కర్ణాటకలో అధికారంలో వస్తే హిందూ సంస్థ 'భజరంగ్ దళ్'ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ప్రకటించడం బీజేపీతొో పాటు పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఇండియా (పీఎఫ్ఐ)తో భజరంగ్ దళ్ ను పోలుస్తూ కాంగ్రెస్ ఈ హామీ ఇవ్వడంపై భజరంగ్ దళ్ మాతృసంస్థ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎన్నికల వాగ్ధానాన్ని సవాల్ గా తీసుకుంటామని విహెచ్‌పి జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ ఓ వీడియో సందేశంలో తెలిపారు. ప్రపంచం మొత్తానికి పీఎఫ్ఐ కార్యకలాపాల గురించి తెలుసని, దేశానికి, సమాజానికి సేవ చేయడానికి అంకితభావంతో ఉన్న భజరంగ్ దళ్ తో పోల్చడం మంచిది కాదని సురేంద్ర జైన్ అన్నారు. కాంగ్రెస్ భజరంగ్ దళ్ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్న తీరును దేశ ప్రజలు అంగీకరించరని అన్నారు. మేము రాజకీయాల్లోకి రామని, కానీ కాంగ్రెస్ మమ్మల్ని రాజకీయాల్లోకి లాగాలనుకుంటోందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ 'సిమి' ఉగ్రవాద సంస్థపై నిషేధాన్ని వ్యతిరేకించారని భజరంగ్ దళ్ గుర్తు చేసింది. ఈ హమీలో కాంగ్రెస్ రహస్య ఎజెండా ఉందని విహెచ్‌పి నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో 'రాముడి'తో సమస్య ఉందని, ప్రస్తుతం ఎవరైతే జై భజరంగబలి అని నినాదలు చేస్తారో వారిని కూడా నిరోధించాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. హోస్పేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ నేను హనుమంతుడి భూమిని గౌరవించాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం భజరంగ్ బలికి తాళం వేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ''హనుమంతుని పాదాలకు నా శిరస్సు వంచి ఈ ప్రతిజ్ఞ నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. కర్ణాటక గౌరవం మరియు సంస్కృతిని ఎవరూ దెబ్బతీయనివ్వవుము'' అని ప్రధాని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)