పోలీసు శాఖను కాషాయీకరణ చేస్తే సహించం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 24 May 2023

పోలీసు శాఖను కాషాయీకరణ చేస్తే సహించం


కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. ''చట్టాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఎవర్నీ అనుమతించం. పోలీసు అధికారులు 3,4 ప్రాంతాల్లో తమ ఎజెండాను పైకి తెచ్చారు. యూనిఫాం తీసేసి రాజకీయ పార్టీల దుస్తులు ధరించి, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇది పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం'' అని డీకే బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో డీకే జరిపిన సమావేశంలోనూ ఈ అంశాన్ని కీలకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. బీజేపీ హయాంలో కొన్ని ఘటనలు జరిగిగాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖను కాషాయీకరణ చేసే ఎలాంటి ప్రయత్నాలు సహించేది లేదని సమావేశంలో ఆయన హెచ్చరించారు. ''పోలీసు శాఖను కాషాయీకరణం చేద్దామనుకుంటున్నారా? మా ప్రభుత్వంలో ఇలాంటివి సాగనీయం. మంగళూరు, బిజాపూరు, బాగల్‌కోట్‌లో మీరు కాషాయ దస్తులు ధరించి పోలీస్ శాఖను ఏవిధంగా అవమానించారో నాకు తెలుసు. దేశాన్ని మీరు గౌరవించదలచుకుంటే జాతీయపతాకంతో పనిచేయండి'' అని డీకే హెచ్చరించారు. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (పీఎస్ఐ) రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకు అధికారుల ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ, పోలీసు శాఖ ఎంత చెడ్డపేరు వస్తోందో చూడండని పోలీసు ఉన్నతాధికారులను ఈ సమావేశంలో డీకే నిలదీశారు. కాగా, మంత్రివర్గ విస్తరణపై బుధవారంనాడు మీడియా సమావేశంలో డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రికి సంబంధించిన అంశమని, ఆయన అధికార పరిధిలోకి వస్తుందని చెప్పారు. దీనిపై సమాధానం చెప్పగలిగేది ఆయన మాత్రమేనని, ఆయననే కలుసుకొమ్మని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా డీకే చెప్పారు.

No comments:

Post a Comment