మాకు రాజకీయ ఓనమాలు నేర్పింది ఆ మహనీయుడే !

Telugu Lo Computer
0


హైద్రాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్ పల్లి ఎక్స్ రోడ్ లో నందమూరి తారక రామారావు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్ర ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కూడా హాజరు కాగా వారి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. దేశంలోనే మొట్ట మొదటిగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది ఎన్టీ రామారావే అన్నారు. మాకు రాజకీయ ఓనమాలు నేర్పింది కూడా ఆ మహనీయుడేనని, పేదవాడి ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకే బియ్యాన్ని అందించిన గొప్ప ప్రజా సంక్షేమ కర్త అని కొనియాడారు. హీరోగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని తెలిపారు. తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర సంపాదించుకున్నారని, ఫలితంగా రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సేవలను గుర్తించిన ప్రజానీకం అన్ని చోట్లా ఆయన విగ్రహాల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అన్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలో 18 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా చేసిన ఏకైక వ్యక్తి తనేనని పోచారం పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పుత్ర సామానుడని, అసెంబ్లీలో చక్కటి భాషతో తన వాణిని గట్టిగా వినిపిస్తాడాని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు బెల్ కొట్టకుండా మాట్లాడే ఎకైక ఎమ్మెల్యే వివేకానందేనని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎక్క డున్నా సరే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారన్నారు. రాజకీయ చైతన్యం, రాజకీయంలో నాయకులు ఎలా నడుచుకోవాలని చూపించిన మహనీయుడు ఎన్టీఆర్ అని స్పష్టంచేశారు. బహదూర్ పల్లి చౌరస్తాలో మంచి ప్లేస్ ఇచ్చి విగ్రహాన్ని ప్రతిష్టించిన కృష్ణారావు, నందమూరి తారక రామారావు స్టేట్ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)