ఉరి తీసినా తాను సిద్ధమే, రెజ్లింగ్ కార్యకలాపాలను మాత్రం నిలిపవద్దు !

Telugu Lo Computer
0


నాలుగు నెలలుగా క్రీడలు నిలిచిపోయాయని, తనను ఉరి తీసినా అందుకు తాను సిద్ధమేనని, అయితే రెజ్లింగ్ కార్యకలాపాలను మాత్రం నిలిపివేయవద్దని  రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కోరారు. వినేష్ పొఘట్‌, సాక్షి మాలిక్‌, బజరంగ్ పునియా సహా పలువురు ప్రముఖ రెజ్లరు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని, ఫెడరేషన్ నుంచి తొలగించాలని రెజ్లర్లు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మహిళా రెజ్లర్లను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ రెజ్లర్లు చేపట్టిన నిరసనలో పలువురు రెజ్లర్లు పాల్గొంటుండటంతో చాంపియన్‌షిప్‌లు, క్యాంపులు సహా రెజ్లింగ్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు దాఖలయ్యాయి. రెజ్లింగ్ కార్యకలాపాలు నిలిపివేయడం క్యాడెట్లు, జూనియర్ రెజ్లర్ల అభివృద్ధికి విఘాతమని, వారి భవిష్యత్‌కు ఆటంకం కలిగించవద్దని బ్రిజ్ భూషణ్ సింగ్ అభ్యర్ధించారు. కాగా తాను 1000 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డానని ఆరోపిస్తున్నారని, అసలు ఇంతమందిపై వేధింపులకు పాల్పడేందుకు తానేమైనా శిలాజాలతో చేసిన రోటీలను తింటున్నానా అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)