బంగారు కుల్ఫీ !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఫేమస్ బజార్ లో ప్రకాశ్ అనే వ్యాపారి గత కొంత కాలంగా ఈ గోల్డ్ కుల్ఫీని అమ్ముతున్నాడు. ఫ్రిడ్జ్ లో ఉంచిన కుల్ఫీని తీసి బంగారపు పూత ఉన్న పల్చటి ఆకులో చుట్టి రూ.351కు అమ్ముతుంటాడు. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ గోల్డ్ కుల్ఫీలు అమ్మే ప్రకాశ్ తన ఒంటినిండా బంగారు వస్తువులు ధరించి ఉండటం విశేషం. వేసవి కాలంలో గోల్డ్ కుల్ఫీలకు మంచి గిరాకీ ఉంటుందని ప్రకాశ్ అంటున్నాడు. ఈ తరహా గోల్డ్ కుల్ఫీలను అమ్ముతున్న వీడియో ని ఫుడ్ బ్లాగర్ కలాష్ సోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై రక రకాల కామెంట్స్ వినిపిస్తుంది. అది అసలు గోల్డ్ కాదని,  అంతా ఉత్తిదే అని, అంతా ఫేక్ అంటూ కొంతమంది మనీ వేస్ట్ బ్రదర్ అంటూ మరికొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని 40 వేల మంది నెటిజన్లు వీక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)