అణిచివేసేందుకు చూస్తున్నారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 3 May 2023

అణిచివేసేందుకు చూస్తున్నారు !


రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్‌ రెజ్లర్లు జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత ఏస్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తిమంతమైన వ్యక్తికి చాలా కాలం పాటు వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టం అన్నారు. తాము నిరసన ప్రారంభించడానికి మూడు, నాలుగు నెలల ముందు ఆ అధికారిని కలిశామని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదనకు గురవుతున్నామని ఆ అధికారికి వివరించి చెప్పామన్నారు. ఆ తర్వాత తాము నిరసనకు దిగిమని వినేష్‌ వెల్లడించింది. ఈనేపథ్యంలోనే కేంద్ర క్రీడామంత్రి అనురాగ్‌ ఠాగూర్‌పై ఫోగట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిటీ వేసి విషయాన్ని అణిచివేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మేము ఆయనతో మాట్లాడాకే నిరసనకు దిగినట్లు చెప్పారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ఒలింపిక్స్‌ ఎంపికకు సంబంధించిన కొత్త నిబంధన విషయమై నిరసనలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఒలింపిక్స్‌ గురించి కాదని తాము లైంగిక వేధింపులకు వ్యతిరేకంగానే నిరసన చేస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మాత్రం తాను రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించినట్లువుతుందన్నారు. అందుకు స్పందించిన వినేష్‌​ ఫోగట్‌ తమకు కావాల్సింది న్యాయం అన్నారు. అతేగాదు మా మన్‌ కీ బాత్‌ వినండి మోదీ అని వినేష్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరికి స్మృతి ఇరానీ కూడా మా గోడు వినడం లేదని ఆవేదనగా చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ విషయమై బ్రిజ్‌ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు.

No comments:

Post a Comment