వైకల్యం పేరుతో ఉద్యోగిని తొలగించొద్దు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సర్వీసులో ఉండగా వివిధ రకాల కారణాలతో వైకల్యానికి గురైన ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి తొలగించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ఉద్యోగి పని చేయడానికి వీలుగా ఉండే పోస్టులో నియమించాలని తెలిపింది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం-2016లోని సెక్షన్‌ 20(4)ను అన్ని శాఖలూ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైకల్యానికి గురైన ఉద్యోగి పనిచేయడానికి వీలుగా పోస్టు లేకపోతే అదే శాఖ పరిధిలో ప్రత్యేక పోస్టు సృష్టించాలని పేర్కొంది. ఈ నియామకంలో సదరు ఉద్యోగి హోదా, జీతభత్యాలు, ఇతర ప్రయోజనాల్లోనూ ఎలాంటి తగ్గింపు ఉండకూడదని వెల్లడించింది. పదోన్నతి కూడా క్రమం తప్పకుండా అందించాలని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)