ఇది థర్డ్ డిగ్రీ ప్రయోగించే కాలం కాదు !

Telugu Lo Computer
0


అసోంలోని గువాహటిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి అమిత్ షా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఇది థర్డ్ డిగ్రీ ప్రయోగించే కాలం  కాదు అని స్పష్టంచేశారు. అలాంటివి ఎక్కడా ఉపయోగించకూడదని అన్నారు. దానికి ప్రత్యామ్నాయ విధానాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్బంగా అమిత్ షా సూచించారు. 'థర్డ్ డిగ్రీ' కి ప్రత్యామ్నాయంగా ఫోరెన్సిక్ విభాగాలను వినియోగించుకోవాలని పోలీసులకు షా సూచించారు. అస్సాం పోలీసులు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన అస్సాం పోలీసుల ‘సేవా సేతు’ మొబైల్ యాప్‌ను అమిత్ షా ప్రారంభించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎఫ్‌ఐఆర్‌లు, తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదులు నమోదు చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. పోలీసులు నేరస్థులపై బల ప్రయోగం చేయటాన్ని 'థర్డ్ డిగ్రీ' అంటారు. అంటే విచారణలో భాగంగా నిందితులను నేరం అంగీరింపచేయటానికి కొట్టటం, హింసించటం వంటివి. వ్యక్తి స్వేచ్ఛను హరించటం కూడా థర్డ్ డిగ్రీ కిందకే వస్తుంది. నేరం ఒప్పుకోవాలని బలవంత పెట్టటం,నేరం ఎలా చేశావో చెప్పమని కొట్టటం వంటివి థర్డ్ డిగ్రీకిందకు వస్తాయి. థర్డ్ డిగ్రీ అనేది చట్ట వ్యతిరేకం. పోలీసులకు నిందితులను కొట్టే హక్కులేదు ఈ విషయం చాలామందికి తెలియదని పలువురు పోలీసులు ఉన్నతాధికారులే చెబుతుంటారు.ఒకవేళ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే వారిపై కేసు పెట్టే హక్కు కూడా సదరు బాధితులకు ఉంటుంది.  తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని బాధితుడు తనను న్యాయస్థానంలో హాజరుపరిచనప్పుడు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళితే బాధితుడిని మేజిస్ట్రేట్ మెడికల్ పరీక్షలకు పంపించటం జరుగుతుంది. వైద్య పరీక్షల్లో నిందితుడు లేదా బాధితుడు చెప్పింది నిజమని నిర్ధారణ అయితే సంబంధిత సెక్షన్ల కింద థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులపై కేసలు నమోదు చేయవచ్చు. దానికి సదరు పోలీసులకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో థర్డ్ డిగ్రీ అనేది చట్టరీత్యా నేరం అనే విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని సూచిస్తుంటారు ఉన్నతాధికారులు.

Post a Comment

0Comments

Post a Comment (0)