ప్రమోషన్ కోసం కొచ్చి మెట్రో సిబ్బంది డ్యాన్స్‌లు !

Telugu Lo Computer
0


కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ సిబ్బంది మెట్రో యూనిఫాం వేసుకుని వచ్చిన ఓ లేడీ ఆగిపోయిన మెట్రో రైలు ముందు అద్భుతంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. తన చేతిని వెనక్కి ఊపుతూ కొలీగ్ ను పిలిచింది.. అక్కడికి వచ్చిన అతనితో ఆమె తెలుగు సినిమా దసరా తమిళ్ వెర్షన్ నుంచి 'మైనారు వెట్టి కట్టి' అనే పెప్పీ సాంగ్ కి డ్యాన్స్ చేశారు. ఇక మరో వీడియోలో ఇద్దరు మహిళలు తమిళ చిత్రం 'ఎనిమీ'లోని ట్రెండింగ్ సాంగ్ 'తుమ్ తుమ్'కి స్టెప్పులు ఇరగదీశారు. రెండు వీడియోల్లో మెట్రో స్టేషన్ మాత్రం ఖాళీగా కనిపిస్తుంది. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అఫిషియల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేరైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌లు చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్టాఫ్ డ్యాన్స్ అద్భుతంగా చేశారని,  ట్రెండ్‌ను ఎప్పుడూ ఫాలో అవ్వండని అభిప్రాయాలు పెట్టారు. ఇంతకీ ఈ ప్రమోషన్ ఎందుకంటే మెట్రో జర్నీ టారీఫ్‌ల వివరాలు, ఆఫర్ల కోసం ఈ హడావిడి అన్నమాట. కొన్ని రాష్ట్రాల్లో మెట్రోల్లో డ్యాన్స్ లు, రీల్స్ చేయకూడదన్న నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మాత్రం మెట్రోని ప్రమోట్ చేసుకునే క్రమంలో తమ స్టాఫ్‌తో డ్యాన్స్ లు చేస్తూ వీడియోలు షేర్ చేయడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)