జనరల్ టికెట్ రిజర్వేషన్ అవసరం లేదు !

Telugu Lo Computer
0


కరోనా సమయంలో రైల్వే శాఖ కొన్ని నిబంధనలు మార్చింది. వాటిని ఇప్పుడు సడలించారు. కరోనా సమయంలో జనరల్ టికెట్లను కూడా మూడ్రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. అప్పటికప్పుడు మీరు రైల్వే స్టేషన్ కి వెళ్లి టికెట్ తీసుకోవాలి అంటే టికెట్లు ఇవ్వడం మానేశారు. మీరు రిజర్వేషన్ చేసుకోవాల్సిందేనని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ నిబంధనను సడలించారు. కరోనా సమయంలో రద్దీని నియంత్రించేందుకు ఆ విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు దాదాపుగా సాధారణ పరిస్థితులు ఉన్నందుకు మునుపటిలాగానే జనరల్ టికెట్లను కౌంటర్ లో తీసుకోవచ్చునని స్పష్టం చేశారు. ఇప్పుడు జనరల్ టికెట్లు పునరుద్ధరణ చేయడం వల్ల రైల్వే ప్రయాణికులకు ఇంకో శుభవార్త కూడా ఉంది. ముూడ్రోజుల ముందు రిజర్వేషన్ చేయాలి అంటే అదనంగా రూ.20 ఛార్జెస్ పడేవి. ఇప్పుడు ఆ అదనపు ఛార్జెస్ ఉండవు. సూపర్ ఫాస్ట్, మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు టికెట్ కౌంటర్లలోనే జనరల్ టికెట్లు జారీ చేయడం మళ్లీ ప్రారంభించారు. రైలుకు ముందు 2 బోగీలు, వెనుక రెండు బోగీలు ఉంటాయి. వాటిలోనే జనరల్ టికెట్లను కేటాయిస్తూ ఉంటారు. అయితే అవసరాన్ని బట్టి ఆ బోగీలను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. పైగా వారిపై భారం కూడా తగ్గించినట్లు అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)