కవిత అకౌంట్స్ నుంచి రూ.80కోట్లు ట్రాన్స్ఫర్ !

Telugu Lo Computer
0


కేజ్రీవాల్ ఇంటి నిర్మాణం విషయంలో సుఖేశ్ మరోసారి ఆరోపణలు చేశారు. ఆ ఇంటి ఫర్నిచర్‌కు అయిన ఖర్చులను తానే భరించినట్లు లేఖలో స్పష్టం చేశాడు. దానికి సంబంధించిన బిల్లులన్నీ తన వద్ద ఉన్నాయని  హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది చెప్పాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత షెల్ కంపెనీల అకౌంట్స్ నుంచి మారిషస్లోని ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయ్యిందని సుఖేష్ లెటర్లో ప్రస్తావించాడు. 25+25+30 కోట్ల క్యాష్ ట్రాన్స్ ఫర్ చేసినట్లు చెప్పాడు. లేఖలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కేజ్రీవాల్ ఫేస్ టైం చాట్స్ వివరాలను త్వరలోనే విడుదల చేస్తానని సుఖేశ్ చంద్రశేఖర్ చెప్పాడు. వాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని వాపోయాడు. తనకు అనుకూలంగా ఉన్న జైలు అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని సుఖేష్ ఆరోపించాడు. దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. త్వరలోనే కేజ్రీ వాల్‌కు సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతానని సుఖేశ్ చంద్రశేఖర్ స్పష్టం చేశాడు. కేజ్రీవాల్ సూచనలతోనే రూ.80 కోట్లు బదిలీ చేసినట్లు సుఖేష్ చెప్పాడు. నగదును యూఎస్‌బీటీ, క్రిప్టో కరెన్సీకి మార్చడిందని, కేజ్రీవాల్ సూచనతోనే అబుదాబికి నగదు పంపారని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)