8న ఇస్కాన్‌ టెంపుల్‌ కు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని కోకాపేట్‌లో మరో ప్రతిష్ఠాత్మక కట్టడం రానున్నది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ది ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్సియస్‌నెస్‌) ఇక్కడ అత్యంత విశాలమైన ప్రాంగణంలో అతిపెద్ద ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. మే 8న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే ఆలయ నిర్మాణ నమూనాను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రధానంగా శ్రీ రాధాకృష్ణ టెంపుల్‌ (బృందావన్‌ హెరిటేజ్‌), శ్రీనివాస గోవింద టెంపుల్‌ (సౌతిండియా హెరిటేజ్‌), రాజగోపు రం, నిత్యాన్నదాన సెంట్రల్‌ హాలు ప్రధానంగా ఉంటాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను ఇస్కాన్‌ ప్రతినిధులు ఎంపీ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు సత్యగౌడ, చంద్రదాస తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)