ఛత్తీస్‌గఢ్‌లో రూ.2వేల కోట్ల మద్యం కుంభకోణం

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్ట బయలైనట్టు ఎన్ ఫోర్స్ మెంట్ ఈడీ ప్రకటించింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేత, రాయ్ పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్ ను ఈడీ మే 6న అరెస్టు చేసింది. ఈ సందర్భంగా మనీ లాండరింగ్ కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల మద్దతుతో నడుస్తోంది. 2019, 2022 మధ్యకాలంలో రూ.2వేల కోట్ల మేర భారీ అవినీతి చోటుచేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. తప్పించుకుని తిరుగుతున్న అన్వర్ ధేబర్ ను.. రాయ్ పూర్ లోని ఓ హోటల్ లో ప్లాన్ చేసి పట్టుకుంటున్నట్టు ఈడీ తెలిపింది. దాంతో పాటు ఈ భారీ అవినీతికి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల మద్దతులో ఈ స్కాంకు తెర లేపారని తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది మార్చిలో దాడులు చేపట్టిన ఈడీ.. మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు సాగించింది. ఆ తర్వాత మేలో ఐటీ ఛార్జ్ షీట్ ఆధారంగా కేసు నమోదు చేసింది. రాష్ట్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం ప్రైవేటు మద్యం దుకాణాలకు పర్మిషన్ లేదు. మొత్తం 800 దుకాణాలను ప్రభుత్వమే నడుపుతుండడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)