ఉచితంగా చేపల పంపిణీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెం వాసులందరికీ సర్పంచ్‌ నాగభూషణం చేపల్ని పంచారు. దీంతో ఊరు ఊరంతా చేపల కూరతో ఘుమఘమలాడింది. బయటవాళ్లకి లీజుకిస్తే చెరువును పాడుచేస్తున్నారని భావించిన సర్పంచ్‌,గతేడాది గ్రామంలోని చెరువును బహిరంగ వేలంలో లీజుకు తీసుకున్నారు. ఆ చెరువులో శీలావతి, కట్ల, రూప్‌చంద్‌, గడ్డిచేపలు వేసి సహజసిద్ధమైన పద్ధతిలో పెంచారు. చేపలన్నీ మంచి సైజులో పెరిగాయి.వీటిని ఊళ్లో జనాలకు చేపల్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటింటికెళ్లి చేపలు అందజేశారు. చెరువు దగ్గర కూడా కొందరికి చేపలు పంచిపెట్టారు. సహజసిద్ధంగా పెరిగిన చేపలు తింటే ఆరోగ్య సమస్యలు రావంటున్నారు స్తానికులు. విలువైన చేపలను ఉచితంగా పంపిణి చేసిన సర్పంచ్‌కు ధన్యవాదాలు గ్రామస్తులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)