నవ్వు ఆపుకోలేకపోయిన పెళ్లి కూతురు !

Telugu Lo Computer
0


ఓ జంట వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు పూజారులు చెప్పినట్లుగా కాకుండా, ఫోటో గ్రాఫర్లు చెప్పినట్లుగా జరుగుతున్నాయనే ఒక టాక్ ఉంది. ఈ వీడియో చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ జంట రిసెప్షన్ వేడుక జరుగుతోంది. అయితే, వేదికపై అందరూ చూస్తుండగానే వరుడు, వధువుకి ప్రపోజ్ చేయాలి. మోకాలి కూర్చొని, పూల బొకేని ఇస్తూ ఆమెకు ప్రపోజ్ చేయాలి. అయితే, అదే ఆ పెళ్లి కొడుక్కి పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. అతనికి కూర్చోరావట్లేదు, లేవరావట్లేదు. అందులోనూ అందరి ముందు ప్రపోజ్ చేసేందుకు అబ్బాయి చాలా మొహమాటపడ్డాడు. చివరకు ఫోటోగ్రాఫర్ వచ్చి  అలా కాదు సారూ.. ఇలా ప్రపోజ్ చేయండి అంటూ కాస్త ట్రైనింగ్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు ప్రయత్నాలను చూసి ఆ పెళ్లి కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. చేతిని అడ్డుపెట్టుకుని ముసి ముసి నవ్వులు నవ్వింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. జనాలు ఆ వీడియోను చూసి అరెరె పెళ్లి కొడుక్కి పెద్ద కష్టమే వచ్చిందిగా అంటూ పంచ్‌లు వేస్తున్నారు. పెళ్లి కొడుకు పడిన తిప్పలు చూసి నవ్వుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)