చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్‌లో విద్యార్థినిలపై లైంగిక వేధింపులు !

Telugu Lo Computer
0


చెన్నైలోని సాంప్రదాయ కళలను బోధించే ప్రతిష్టాత్మక కళాక్షేత్ర ఫౌండేషన్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ హరి పద్మన్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పద్మన్‌పై కేసు బుక్ చేశారు. ఆ ప్రొఫెసర్‌, మరో ముగ్గురు రిపర్టరీ ఆర్టిస్టులు తమను లైంగికంగా వేధిస్తున్నారని, బాడీ షేమింగ్, దుర్భాషలాడుతున్నారని ఆమెతో పాటు మరో 200 మంది విద్యార్థినిలు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు, వారి పేరెంట్స్‌ కూడా నిరసనలు దిగారు. గతంలో కూడా హరి పద్మన్‌పై లైంగిక వేధింపుల కారణంగా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థినిలు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఇందులో నిజం లేదని తప్పుడు ప్రచారం అంటూ కమిషన్‌ వారి ఫిర్యాదును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా దాదాపు 90 మంది విద్యార్థినులు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్‌కి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం, విద్యార్థినిలు.. డైరెక్టర్ రేవతి రామచంద్రన్‌ను తొలగించాలని, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌లకు లేఖ రాశారు. దీంతో, స్పందించిన సీఎం స్టాలిన్‌ నిందితులపై కఠినంగా లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)