కాన్వాయ్‌ను అడ్డగించడంతో ఆగ్రహించిన యడ్యూరప్ప ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 March 2023

కాన్వాయ్‌ను అడ్డగించడంతో ఆగ్రహించిన యడ్యూరప్ప !


కర్నాటకలో చికమగుళూర్ జిల్లా మడికెరలో స్ధానిక ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామికి పార్టీ టికెట్ ఇవ్వవద్దని నిరసనకారులు డిమాండ్ చేశారు. మాజీ సీఎం యడ్యూరప్ప ఈ ప్రాంతంలో భారీ రోడ్‌షో నిర్వహణకు ముందు భారీ నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. విజయ్ సంకల్ప్ యాత్ర సందర్భంగా యడ్యూరప్ప ఈ ప్రాంతానికి రాగానే ఆయన కారును నిరసనకారులు అడ్డగించి ధర్నాకు దిగారు. పార్టీ కార్యకర్తలు తన కాన్వాయ్‌ను అడ్డగించడంతో ఆగ్రహించిన యడ్యూరప్ప తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెనుతిరిగారు. యడ్యూరప్ప కార్యక్రమాన్ని అడ్డుకున్న పార్టీ కార్యకర్తలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment